Home చదువు ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం: మంత్రి సబితా

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం: మంత్రి సబితా

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు.  ఈ క్రమంలో విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టల్స్ తెరవడంపై పరిస్థితులను విశ్లేషించడానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్షా సమావేశం నిర్వహించి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ఈనెల 25లోపు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.


కాగా..విద్యా సంస్థలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని.. వారి భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే చేరవేసినట్లు వెల్లడించారు. కాగా..కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా గత విద్యాసంవత్సరంలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతోపాటు.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.. ఇతర రాష్ట్రాల తరహాలోనే విద్యాసంస్థలను తిరిగి తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు