ఈ ఏడాది మే నెలలో UGC-NET పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ప్రతీ ఏడాది UGC-NET పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..కాగా, అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఇక అంతకుముందు ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి.Attachments area