అధికారంలోకి వస్తే ఓ జిల్లాకు అల్లూరి పేరును పెడతామని పాదయాత్ర సమయంలో జగన్ గారు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రయత్నం లో భాగంగా ఒక జిల్లాకు అల్లూరి పేరును పెట్టి తాను మడమ తిప్పని నాయకుడిని అని జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే అల్లూరి 123వ జయంతిని పురస్కరించుకుని MP అవంతి శ్రీనివాస్ గారు విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలలో ఒక జిల్లాకు అల్లూరు అని నామకరణం చేస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా అల్లూరి సీతారామరాజు పుట్టిన విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంకి గ్రామంను టూరిజం ప్రదేశం గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు