ప్రాణాయామం అంటే ప్రాణవాయువును అదుపులోకి తెచ్చుకోవడం. ఈ ప్రాణాయామం ఇప్పటిది కాదు…ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర గలది. దీని గురించి భగవత్ గీత లో కూడా చెప్పబడింది…!
ప్రశాంతమైన వాతావరణం లో ఒక మంచి ఆసనం మీద అనగా ఒక చిన్న చాప లేదా వస్త్రం లేదా దుప్పటి మీద కూర్చుని చేయాలి. పద్మాసనం వేసుకుని, మన శరీరమును మరియు తలను నిటారుగా నిలిపి చేతులను మోకాళ్లపై చిన్ముద్ర లో ఉంచి ప్రశాంతం గా ఈ ప్రాణాయామం ప్రక్రియను ప్రారంభించాలి.
మొదట రెండు నాసికా రంద్రాల ద్వారా ఊపిరితిత్తులలో ఉన్న గాలిని బయటకు వదలి, కుడి ముక్కును బొటన వేలితో మూసి చాల మెల్లిగా ఎడమ ముక్కు ద్వారా ప్రాణవాయువును ఊపిరి తిత్తులు నిండా లోనికి పీల్చాలి.
వెంటనే ఎడమ ముక్కును ఉంగరం వేలితో మూసి కుడి ముక్కు ద్వారా పీల్చుటకు ఎంత సమయం పట్టిందో అంతకు రెట్టింపు సమయంలో మెల్లగా గాలిని బయటకు వదలాలి
వెంటనే అదే కుడి ముక్కు ద్వారా గాలిని లోనికి మొదట చేసిన విధం గా పీల్చాలి.
ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రాణాయామం అవుతుంది
మీరు నిపుణుల పర్యవేక్షణలో ఒకసారి మీరు ప్రయత్నించండి. ఆ తరవాత మీరు ఇంటి దగ్గర ఉండి క్రమం తప్పకుండా చేసి చుడండి. మార్పు మీకే తెలుస్తుంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో, ప్రాణాయామం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిరంతర సాధన ద్వారా దీని మీద పట్టు సాధించవచ్చు
మన ఆరోగ్యం మన చేతుల్లోనే