Home లేడీస్ స్పెషల్ ఋతుక్రమంలో అవసరమయిన రెండు విషయాలు (మహిళా సంచిక)

ఋతుక్రమంలో అవసరమయిన రెండు విషయాలు (మహిళా సంచిక)

12ఏళ్ల లేత ప్రాయంలో శరీరంలో జరిగే మార్పులు, జీవితంలోని కొన్ని శాశ్వతమైన మార్పులకు కారణమయ్యి, ఆ తర్వాత ప్రతినెల చుట్టపు చూపుగా వచ్చి పలకరించి వెళ్తుందీ నెలసరి, ఋతుక్రమం. ఒకప్పుడు అంటే మగవాళ్ల ముందు ఆ పదం కానీ, ఆ ప్రస్తావన కానీ రానిచ్చేవారు కాదు, పొరపాటున వస్తే, అదొక పాపంలా చూసేవారు, కానీ ఇప్పుడు ఆధునికత చేసిన చాలా మంచి మార్పులలో ఇది కూడా ఒకటి, ఋతుక్రమం అనేది స్త్రీతత్వం, అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అవ్వొచ్చు, కాకపోవచ్చు కానీ సిగ్గుపడాల్సిన విషయం మాత్రం కాదు అని అర్థమయ్యేలా చేసింది.

ఆధునికత అయితే వచ్చింది కానీ, ఆడవారికి ఆ సమయంలో అవసరమైనవి ఏంటి అని అర్ధంచేసుకునేవారు, వారికి అవసరమయినవి అందిచ్చేవారు ఇంకా తక్కువే ఉన్నారు, ఇది చదువుతున్న మీరు, ఆడవారైతే మీకేమి కావాలో గుర్తించండి, మగవారైతే మీ జీవితంలోని స్త్రీలకోసం తెలుసుకోండి. చాలా సింపుల్ గా రెండే రెండు విషయాలు,

1. ఆహారం: రోజు తింటారు కదండీ, ఇందులో స్పెషల్ గా ఏంటి అని అనుకుంటే, నెలలోని మిగిలిన పాతిక రోజులు వేరు, ఋతుక్రమపు ఆ 5,6రోజులు వేరు, నిజానికి నెలంతా బాగా తింటే ఆ నాలుగురోజుల గురించి వేరే చెప్పుకోవాలిసిన పనిలేదు, కానీ మనదేశంలో అలా తినాల్సిన పౌషికాహారం దొరికే స్త్రీలు చాలా తక్కువ, కాబట్టి కొన్ని ముఖ్యమయన ఆహారపదార్దాలు, నెలంతా తింటే చాలా మంచిది, కానీ కనీసం నెలలో కొన్నిరోజులయిన తప్పక తినండి. ఆకుకూరలు, గుడ్లు, చేపలు, బాదం, పీచు పదార్దాలుండే కూరగాయలు, ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ, ఆపిల్ వంటివి శరీరంలో రక్తం పడటానికి చాలా సాయపడతాయి. శరీరంలో సరిపడా రక్తం ఉంటె, చాలా వరకు నెలసరిలో వచ్చే నొప్పులు తగ్గుతాయి, 

ఏమేమి తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, తినకూడనివి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం , ఇప్పుడు చెప్పే ఆహారపదార్దాలు పూర్తిగా తగ్గిస్తే మంచిదే, కానీ అలా వీలు పడదు అనుకుంటే కనీసం నెలసరి కొన్ని రోజులముందు నుంచి దూరం పెట్టండి, నెలసరి సమయంలో తప్పక దూరం పెట్టండి, ముఖ్యంగా కారం, మసాలాలు ఎక్కువ ఉండే కూరలు, నూనెలో వేయించి తీసే ఫ్రైలు, చిప్స్, అవి శరీరానికి అంత మంచివి కాదు సరికదా, నెలసరి సమయంలో ఇబ్బందిపడేలా చేస్తాయి. 

2. ఆనందం: మీరు చదివింది కరెక్టే, ఆనందమే, ఎందుకంటే సంతోషంగా ఉంటే, సగం నొప్పులు తగ్గిపోతాయి, సొంతవాళ్ల ప్రేమ శరీరానికి సాంత్వన ఇస్తుంది. ఆడవాళ్ళు వాళ్ళ నొప్పి ఇది అని ఎవరితో చెప్పుకోడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళని అర్ధం చేసుకుని కాస్త ప్రేమగా ఉంటె, వాళ్ళ పనుల్లో సాయం చేసి, వాళ్ళకి కాస్త రెస్ట్ ఇచ్చి, కొద్దిగా సరదాగా మాట్లాడితే, కొంచెం నవ్విస్తే, అంతే చాలు. ఇదే ఆడవారికి పదివేలు. నేను చెప్పే ఆడవారు మీకు భార్య అవ్వాల్సిన పనిలేదండోయ్, అమ్మ అవ్వొచ్చు, అక్క అవ్వొచ్చు, వేరే ఇంటి ఆడబిడ్డ అవ్వచ్చు, నీ స్నేహితురాలు అవ్వొచ్చు, లేదా నీ తోటి ఆడది అవ్వొచ్చు. ఒక్కసారి ఆలోచించండి.

వెలచేయని చిన్న కష్టం, మిమ్మల్ని వెలకట్టలేనంత ఇష్టపడేలా చేస్తుంది

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు