తైమూర్‌కు తమ్ముడొచ్చాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బేబో కరీనాకపూర్ మరోసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా, గతేడాది ఆగస్టు 12న కరీనా తాను గర్భవతి అయిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండో బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇక రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో తైమూర్‌కు బుల్లి తమ్ముడొచ్చాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కరీనా ఫ్యామిలీ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా 2012లో ఆయనతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు 2016లో తైమూర్ అలీఖాన్ జన్మించాడు. చిన్నప్పటి నుండి తైమూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఈ చిన్నారి వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి కరీనా.. ఆమిర్‌ఖాన్ సరసన ‘లాల్ సింగ్ చద్దా’, ‘తాకత్’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు తల్లైన సందర్భంగా కొద్ది రోజులపాటు షూటింగ్‌కు విరామం ఇవ్వనుంది. మరోవైపు సైఫ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.