బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరో సారి తల్లి అయ్యారు. ఈ రోజు ముంబై లోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యం తో ఉన్నట్లు సమాచారం. కపూర్, ఖాన్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఈ జంట మొదటి సంతానం తైమూర్ అలీ ఖాన్ 2016 లో జన్మించాడు. అన్నట్లు కరీనా ఇప్పుడు అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్నారు. పుత్రోత్సాహం లో ఉన్న కరీనా, సైఫ్ ల ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.