Home సినిమాలు సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ : కాలక్షేపం కామెడీ - 2.75/5

సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ : కాలక్షేపం కామెడీ – 2.75/5

నటీ నటులు : సాయి తేజ్ మరియు నభా నటేష్

సంగీతం : తమన్

నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్

రచన దర్శకత్వం : సుబ్బు

నిర్మాణం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

విడుదల తేదీ : 25-12-2020

జీ స్టూడియో విడుదల చేసిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఎలా ఉందో చూద్దాం.   కరోనా ప్రతికూల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో ధైర్యం గా ఈ సినిమా విడుదల చేసినందుకు మొదటగా ఈ చిత్ర యూనిట్ ను అభినందించాలి.  ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రతిస్పందన  మిగతా నిర్మాతలకు ప్రేరణ కలిగిస్తుందని నిస్సందేహం గా చెప్పవచ్చు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, పేరులోనే ఉంది అంతా.  పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది అన్న పాయింట్ మీద లాగారు.  బరువైన సన్నివేశాలు లేవు.  బలమైన సంభాషణలు లేవు.  ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన ధ్యేయం గా ఈ సినిమా తీశారని తెలుస్తోంది. 

బలాలు

  • సాయి తేజ్ నటన
  • కమెడియన్ సత్య మరియు వెన్నెల కిషోర్ ల హాస్యం

బలహీనతలు

  • కథలో పట్టు లేకపోవడం
  • రాబోయే సన్నివేశాలు ప్రేక్షకులకు తెలిసిపోయేలా ఉన్న స్క్రీన్ ప్లే
  • రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్  లాంటి హేమా హేమీలకు సరైన, బలమైన రోల్ లేదు
  • పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుందని అని చెప్పే హీరో , ఇంట్లో అమ్మ నాన్నలతో సరిగా మాట్లాడక పోవడం లో లాజిక్ అంతుబట్టడం లేదు
  • మరీ ముఖ్యంగా, చివరలో సినిమాని తేల్చేయడం

లాజిక్ ల కోసం వెతకకుండా, కథ కోసం ఆరాటపడకుండా , కాసేపు నవ్వుకుందాం అనుకునే వారు ఈ సినిమా ఒకసారి చూడవచ్చు.

ఇప్పుడు ఉన్న ఒకే ఒక సినిమా, క్రిస్మస్ సెలవులు, కొత్త సంవత్సరం మరియు ఎన్నో నెలల తరవాత వచ్చిన సినిమా అది మెగా హీరో కాబట్టి ఓపెనింగ్స్ కు డోకా ఉండక పోవచ్చు.

ఏది ఏమైనా చిత్ర పరిశ్రమకు ఒకింత ఊతం ఇంచిందని చెప్పవచ్చు.  నిర్మాతలూ మీరు మీ చిత్రాలను ప్లాన్ చేసుకోండి.  మంచి సినిమా అందిస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పడు సిద్ధమే

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు