Home సినిమాలు ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌'ఆసక్తిరేపుతున్న 'కోబ్రా’ టీజర్‌..

ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌’ఆసక్తిరేపుతున్న ‘కోబ్రా’ టీజర్‌..

తమిళ సూపర్ స్టార్ చియాన్‌ విక్రమ్‌ హీరోగా ‘కోబ్రా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా శనివారం ఆ సినిమా టీజర్‌ విడుదలయ్యింది. ఈ సినిమాలో తనదైన శైలిలోవిక్రమ్ శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్‌గా‌, రాజకీయనాయకుడిగా, మత భోదకుడిగా విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు..ఇక ‘కోబ్రా’లో మరో విశేషం ఏంటంటే టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘కోబ్రా’లో ఇర్ఫాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కోల్‌కతాలో షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘కోల్‌కతాలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ ఏం చేస్తున్నారు ’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు…
కాగా,సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అజయ్‌  జ్ఞానముత్తు దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేఎస్‌ రవికుమార్‌, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ‘కోబ్రా’ సినిమాను వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు