మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.అక్కడ బిజు మేనన్, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ కథానాయకుడు రానా పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనుండగా.. కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికయ్యారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేశారు. జనవరి 20 నుంచి 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ ఈ సెట్ లో జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారని.. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారని సమాచారం.