మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ‘బాక్సర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాక్సర్‌గా మారడానికి పలువురు బాక్సింగ్ ఫ్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు వరుణ్. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ వరుణ్ కు జోడిగా నటిస్తుండగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే జనవరి 19వ తేదీ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలోనే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల్లో సంతోషం మొదలైంది. ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..