Home సినిమాలు సలార్‌' అప్‌డేట్‌..హీరోయిన్‌,విలన్‌ ఎవరో తెలుసా..!

సలార్‌’ అప్‌డేట్‌..హీరోయిన్‌,విలన్‌ ఎవరో తెలుసా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాం ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వీపరీతమైన స్పందన లభించింది.తాజాగా సలార్‌’ చిత్రం ముహూర్తం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.ఈ కార్యక్రమానికి కర్నాటక డిప్యూటీ సీయం అశ్వత్థ నారాయణ్,రాక్‌స్టార్‌యశ్, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి, నవీన్‌ యర్నేని హాజరయ్యారు..


కాగా, సలార్‌ చిత్రానికి సంబంధించి ఓ లెటెస్ట్‌ అప్‌డేట్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్‌ పాల్గొననున్నాడు. ఎలాంటి విరామం లేకుండా వరుసగా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొత్తం షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే ముగించాలని నిర్ణయించాడని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ, ఎంఎస్‌ ధోని ఫేమ్‌ దిషా పటానిని ప్రభాస్ కు జోడిగా తీసుకోవాలని చిత్ర యూనిట్  భావిస్తున్నట్లు సమాచారం.అలాగే విలన్‌గా బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు