Home సినిమాలు 'ఆచార్య’లో 'సిద్ధా’గా రామ్‌చరణ్‌.. పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్

‘ఆచార్య’లో ‘సిద్ధా’గా రామ్‌చరణ్‌.. పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా.. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు.కాగా..ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ సోషల్‌మీడియా వేదికగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో మెగా పవర్ స్టార్ మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో కనిపించారు. ఈ సినిమాలో చరణ్‌ ‘సిద్ధా’ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.. మన సిద్ధాకు ‘ఆచార్య’ సెట్‌లోకి స్వాగతం పలుకుతున్నాం. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ షూటింగ్ లో పాల్గొంటున్నారు అని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది..

అత్యంత ప్రముఖమైనవి

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు