Home సినిమాలు 'క్రాక్' తొలి వారం వసూళ్లు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

‘క్రాక్’ తొలి వారం వసూళ్లు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్‌’‌.సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. సంగీతం దర్శకుడు తమన్‌. బి.మధు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

కాగా..2017లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా దాదాపు 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత రవితేజ సినిమాలు ఏవి కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ సినిమాలు కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు.  దాంతో రవితేజ పని అయిపోయిందని విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో విడుదలైన ‘క్రాక్’ సినిమా 10 కోట్లు కాదు 7 రోజుల్లోనే లాభాలు కూడా మొదలెట్టింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన క్రాక్.. కేవలం వారం రోజుల్లోనే భారీ వసూళ్లు సాధిస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 21. 50  కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది.. కనీసం రోజుకు 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుంది ‘క్రాక్’..దీంతో ర‌వితేజ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు