Home సినిమాలు దుబాయ్‌కి బయల్దేరిన మహేశ్‌.. ఎందుకంటే ?

దుబాయ్‌కి బయల్దేరిన మహేశ్‌.. ఎందుకంటే ?

భరత్‌ అను నేను‘, ‘మహర్షి’,  ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మించనున్నాయి. కీర్తీ సురేశ్‌ కథానాయిక. బ్యాంక్‌ స్కామ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలిసింది.ఈ సినిమాలో మహేశ్‌ బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మది కెమెరామేన్‌.మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది..ఇదిలావుండగా..’సర్కారువారి పాట’ షూటింగ్‌ కోసం మహేశ్ బాబు దుబాయ్‌ వెళ్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఈ నెలాఖరున దుబాయ్‌లో ఆరంబించాలనుకుంటున్నారని తెలిసింది. అక్కడ ఇరవై రోజుల పాటు షూటింగ్ జరిపి, హైదరాబాద్‌ వస్తారట..ఆ తరువాత ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్‌ చేశారని సమాచారం..

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు