Home సినిమాలు నా గురించే ఆలోచిస్తున్నావా..?వైరల్ అవుతున్న సమంత కామెంట్

నా గురించే ఆలోచిస్తున్నావా..?వైరల్ అవుతున్న సమంత కామెంట్

‘ఏం మాయ చేసావే’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించింది. చూడగానే కట్టిపడేసే అందంతో అబ్బాయిల మనసుల్ని దోచేసింది. అయితే ఎంతోమందికి అభిమాన తారగా మారిన సమంత  మాత్రం నవ యువ సామ్రాట్  నాగచైతన్య కోసం తపించేది. ఏమాయ చేసావే చిత్రం.. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ల మనసులను మాయ చేసింది. దీంతో 2017లో మూడుముళ్ల బంధంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లయి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త జంటగానే కనిపిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఈ జోడీ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా ఉంటుంది…


ఇదిలావుండగా..నాగ చైతన్య తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలను లవ్‌ స్టోరీ షూటింగ్‌ విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ తీసాడు.. అందులో చైతన్య దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. దీంతో అతని భార్య సమంత ‘నా గురించే ఆలోచిస్తున్నావా?’ అని ఓ చిలిపి కామెంట్‌ పెట్టింది. దీనికి చై ఎలాంటి రిప్లై ఇవ్వకపోయినా అభిమానులు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక చైతన్య నటించిన “లవ్‌ స్టోరీ” టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ అవగా మంచి స్పందన లభించింది.  ఈ చిత్రానికి ఫిదా డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు..మరోవైపు సమంత ఉగ్రవాదిగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్‌ 2” వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇక దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించనున్న “శాంకుతలం” సినిమాలో సమంత హీరోయిన్‌గా కనిపించనుంది…Attachments area

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు