టాలీవుడ్లో మరో మల్టీస్టారర్ పట్టాలెక్కింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్లుగా సాయిపల్లవి, ఐశ్వర్యరాజేష్‌లు నటించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా..ఈ చిత్రంలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రముఖ నటుడు సముద్రఖని తెలియజేశారు.దర్శకుడు త్రివిక్రమ్ ఫోన్ చేసి అడగడంతో సినిమాలో ఆ పాత్ర గురించి తెలుసుకోకుండానే ఒప్పుకున్నానని అన్నారు.అల.. వైకుంఠపురములో, క్రాక్ విజయాల తర్వాత తెలుగులో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ తోపాటు నితిన్, నాని సినిమాల్లో సైతం నేను నటిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్,రానా కలిసి నటిస్తున్న సినిమాలో నేను ముఖ్య పాత్రలో నటిస్తున్నానని సముద్రఖని వెల్లడించారు..Attachments area