బాహుబలితో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ కు సంబంధించిన ఏ విషయమైన తెగ ట్రెండ్ అవుతుంది. అలాంటిది ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ వస్తే.. ఇక చెప్పేది ఏం ఉంది. అభిమానులకు పండగే. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరు ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆది పురుష్’ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆది పురుష్’కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం.
భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ‘ఆది పురుష్’ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా జనవరి 19న ఉదయం వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ టీమ్‌తో కలిసి దర్శకుడు ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు. ‘‘మోషన్ క్యాప్చర్ మొదలైంది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’’ అని ప్రభాస్ పేర్కొన్నారు.సాధారణంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఇంటర్నేషనల్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అత్యున్నత టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీని ఫిబ్రవరి 2న సినిమా లాంఛనంగా ప్రారంభిస్తారు. టీ సిరీస్ బ్యానర్ భూషణ్ కుమార్, కృషన్ కుమార్‌లతో పాటు ఓంరావుత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు…