Home సినిమాలు విజయ్ దేవరకొండ సినిమా టైటిల్‌ ‘లైగర్’కు అర్థ‌మేంటో తెలుసా?

విజయ్ దేవరకొండ సినిమా టైటిల్‌ ‘లైగర్’కు అర్థ‌మేంటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పూరీ, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగానే చిత్రయూనిట్‌ సోమవారం ఉదయం పది గంటలకు సినిమా టైటిల్‌ను రివీల్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది…


అయితే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పొడవాటి కురులతో చేతికి గ్లోవ్స్ ధరించి గర్జిస్తూ కనిపించారు. ఆయన వెనుక సింహం, పులి ముఖాలను సగం సగం ఉంచారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్‌గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు..అయితే ఈ టైటిల్ గురించి గూగుల్ లో వెతుకుతున్నారు అభిమానులు. లైగర్ అనే పదం కొత్తగా ఉందేంటి అని అడుగుతున్నారు.అయితే.. దీనికి అర్థం ఉంది. సాధారణంగా క్రాస్ బ్రీడ్ ను లైగర్ అంటారు. అందుకే ట్యాగ్ లైన్ కూడా ఇదే పెట్టాడు పూరీ జగన్నాథ్. లైగర్ సినిమాతోనే బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. వరస ఫ్లాపులతో ఉన్న విజయ్ కు ఈ చిత్ర విజయం కీలకంగా మారింది..కాగా, లైగర్ అనే పదానికి డిక్షనరిలో కూడా ఒక అర్థం ఉంది.. మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు. ఇప్పుడు విజయ్ సినిమాకు పూరీ ఇదే పేరును ఫిక్స్ చేసారు..

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు