Home సినిమాలు విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి టైటిల్ ఫిక్స్..

విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి టైటిల్ ఫిక్స్..

ఆకట్టుకునేలా ఫస్ట్‌లుక్‌

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సోమవారం  ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘లైగర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.బాక్సింగ్‌ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.


పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు.దీనికి సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌.జులపాలతో విజయ్‌ దేవరకొండ బాక్సింగ్‌ గ్లవ్స్‌ వేసుకుని నిలుచుంటే అతని వెనుక సింహం, పులి ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది..ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ‘లైగర్‌’ చిత్రాన్ని పూరీ, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు