Home సినిమాలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' క్లైమాక్స్ మొదలైంది.. స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి‌‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్ మొదలైంది.. స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి‌‌

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెంచాయి. కాగా..ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ స్వయంగా వెల్లడించింది. “వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది” అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఈ మేరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ యుద్ధ సమరంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న ఫొటో షేర్ చేసింది..


ఇదిలావుండగా..‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్టు 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు