Home సినిమాలు గని’గా వరుణ్‌తేజ్‌..దుమ్మురేపుతున్న ఫ‌స్ట్ లుక్

గని’గా వరుణ్‌తేజ్‌..దుమ్మురేపుతున్న ఫ‌స్ట్ లుక్

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోగానూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..నేడు(జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు..అలాగే బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గని’అనే టైటిల్‌ ఖరారు చేశారు..కాగా,’ముకుంద’ సినిమాతో  వెండితెర ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన క‌థ‌లను ఎంపిక చేసుకుంటూ మంచి విజ‌యాలు అందుకుంటున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో  ఎఫ్ 2, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రాల‌తో భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే..
ఇదిలావుండగా.. ‘గని’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను జులై 30న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే..

అత్యంత ప్రముఖమైనవి

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

ఇటీవలి వ్యాఖ్యలు