యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు..
కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.. ఈ చిత్రం ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకోగా.. ఇంకా 20 శాతం షూటింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో మిగిలి ఉన్న చిత్రీకరణ జరుగుతోంది. అలాగే ఇందులో నాలుగు పాటలు ఉంటే.. ఈ నాలుగు పాటల్లోనూ ఇద్దరు హీరోలు కనిపించనున్నారని సమాచారం.. ఇక ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ అంతా పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఏ దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి యోచిస్తున్నట్లు సమాచారం..