బోల్డ్‌గా ‘పిట్టకథలు’ ట్రైలర్
బాలీవుడ్ లో అద్భుత విజయం సాధించిన ‘లస్ట్ సోరీస్’ వెబ్ సిరీస్ తెలుగులో ‘పిట్ట కథలు’పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు కథలుగా ఉన్న ఈ సీరిస్‌ని నలుగు దర్శకులు తెలుగులో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డిలు రూపొందించిన ఈ పిట్టకథలు సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో శ్రుతిహాసన్, ఇషా రెబ్బా, అమలాపాల్, జగపతిబాబు, సత్యదేవ్, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు.
కాగా..నలుగురు మహిళలు జీవితాల్లోని ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం వంటి భావోద్వేగాలు.. వాటికి, వారి నలుగురికి మధ్య కనక్షన్ ఏంటి అన్న పాయింట్‌పై సినిమాను బోల్డ్‌గా తెరకెక్కించారు. రిలీజ్ అయిన టీజర్లో కూడా అవి ప్రతిబింబిస్తాయి.. ఆర్ఎస్వీపీ మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘పిట్ట కథలు’ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల కానుంది..