టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ దూసుకుపోతున్నాడు. కొత్తదనం లోపిస్తుందని, కాపీ క్యాట్ అని థమన్ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ‘క్రాక్’తో మరో హిట్‌ను కొట్టాడు..అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని తమన్ కొట్టేశాడు. లూసిఫర్‌కు స్వరాలు సమకూర్చే అవకాశం దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు..
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకోంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయన్‌గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటుడు సోనూసూద్ ఈ సినిమాలో ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నారు.