చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ పనులు హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక.ఇక ఈ సినిమా విడుదల తేది విషయానికి వస్తే.. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న థియేటర్లలోకి వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాబట్టి ఆ సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ సినిమాను కూడా ఆ లక్కీడేట్ నాడే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రయూనిట్.
కాగా, ‘ఆచార్య’టీజర్ రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ సినిమా టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనిపించనున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఈ టీజర్‌పై మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..