Home సినిమాలు ప్రదీప్‌ ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ ట్రైలర్‌ రివ్యూ..

ప్రదీప్‌ ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ ట్రైలర్‌ రివ్యూ..

ప్రదీప్‌ మాచిరాజు..ఇప్పటివరకు యాంకర్‌గానే పరిచయం. కొన్ని సినిమాల్లో హీరోకు స్నేహితుడుగానూ కనిపించాడు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్‌ ఎంతోమంది ప్రేక్షకుల సెల్‌ఫోన్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్‌ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం, సిద్‌ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్‌ చేశాయి. 


కాగా,ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్ర యూనిట్‌కు అంతా మంచే జరగాలని కోరుతూ.. విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే సినిమాలో విషయం చాలానే సస్పెన్స్ ఉందని తెలుస్తోంది..ప్రేమ కథకి పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు మున్నా. ఆ జన్మలో కలవని జంట..ఈ జన్మలో ఎలా కలిసారనే కాన్సెప్టుతో సినిమా ఉంటుంది. ఈ క్రమంలోనే నాటికి నేటికి లింక్ పెడుతూ..అందులోనే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రమైన లాజిక్ పెట్టాడు దర్శకుడు. దాన్నే ట్రైలర్ లోనూ చూపించాడు. మరి చూడాలిక.. జనవరి 29న రాబోయే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో….!

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు