ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న వింటేజ్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసిద్ధ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, తదితరులు ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు.అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో అలరించనున్నారు..
కాగా,భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రబృందం ప్రణాళిక చేస్తునట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.మరోవైపు ప్రభాస్ ‘రాధేశ్యామ్’చిత్రీకరణలో బిజీగా ఉంటూనే ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్’సినిమాను ప్రారంభించారు.