సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించనుందన్నదే ఆ వార్త..బుధవారం 81వ పుట్టిన రోజు జరుపుకున్న కృష్ణం రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అందుకోసమే గడ్డం పెంచుతున్నానని తెలిపారు. తన పాత్రతో పాటు ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాగా,ఇటలీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్, టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.Attachments area