Home సినిమాలు న‌మ్ర‌తకి మ‌హేష్ బ‌ర్త్‌డే విషెస్.. పోస్ట్ వైర‌ల్

న‌మ్ర‌తకి మ‌హేష్ బ‌ర్త్‌డే విషెస్.. పోస్ట్ వైర‌ల్

జనవరి 22వ తేదీ తనకెంతో ప్రత్యేకమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. నేడు మహేష్‌ భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లో గ్రాండ్‌గా వేడుకలు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. శ్రీమ‌తి పుట్టిరోజు సందర్భంగా సూపర్‌స్టార్‌ స్పెషల్‌ విషెస్‌ అందజేశారు.’నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు. నమ్రత.. నీతో ప్రతిరోజూ ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం మరెంతో ప్రత్యేకం. నా అద్భుతమైన మహిళకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే  లేడీ బాస్ అని మహేశ్‌ పేర్కొన్నారు.కాగా, ఆయన పెట్టిన పోస్ట్‌పై నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. ‘నా ప్రతి ఏడాదినీ ఎంతో స్పెషల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ’ అని రిప్లై ఇచ్చారు.ఈ ట్వీట్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుది.


కాగా..’భరత్‌ అను నేను‘, ‘మహర్షి’,  ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన మహేశ్‌బాబు  ‘సర్కారు వారి పాట’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. త్వరలో ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో ప్రారంభం కానుందని సమాచారం.జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీస్‌, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు