మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. రీ ఎంట్రీలో ముందు కాస్త నెమ్మదిగా అడుగులు వేసిన చిరు, ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి ప్రస్టీజియస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. ఆ తరువాత మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘లూసిఫర్’ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అలాగే ఈ రెండు సినిమాల తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలమ్’ రీమేక్‌కు ప్లాన్చేశారు మెగాస్టార్.
కాగా, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా ఉంటుందని చిరంజీవి ప్రకటించాడు. తాజాగా ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోని షేర్ చేసి.. ఈ నలుగురు నా కెప్టెన్లు అంటూ పేర్కొన్నాడు.ఈ ఫోటోలో మెహర్ రమేష్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు..వీరందరితో చిరు సినిమాలు చేయబోతున్నారు కాబట్టే నా కెప్టెన్లు అంటూ ప్రకటించారు.ప్రస్తుతం ‘లూసిఫర్’ రీమేక్ చిత్రీకరణ ఫిబ్రవరి నుంచి ఏకధాటిగా జరిపి, మధ్యలో మెహర్ రమేష్‌తో చేసే సినిమాని ప్రారంభించేలా చిరు కసరత్తు చేస్తున్నారట. మెహర్ రమేష్‌తో చేసే సినిమా సెట్‌పై ఉండగానే.. బాబీతో చేసే సినిమాని ప్రారంభించాలని.. ఈ ఏడాది చివరి వరకు దాదాపు ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.