రాక్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న కే జి ఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. కాగా, ఇటీవలే యశ్ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ కు ప్రేక్షకులు విశేష ఆదరణ లభించింది.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్‌నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 జూన్ 30న విడుదల కానుందని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ మరొకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
‘కే జి ఎఫ్ 2’ మూవీ జూన్ 30న కాకుండా మే 30న అంటే నెల ముందుగానే వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి కీలక ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ బిజీగా ఉన్నాడు.Attachments area