Home సినిమాలు రామ్‌చరణ్‌, యశ్‌తో భారీ మ‌ల్టీ స్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న శంక‌ర్!

రామ్‌చరణ్‌, యశ్‌తో భారీ మ‌ల్టీ స్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న శంక‌ర్!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు ఈ టాప్ డైరెక్టర్. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్‏తో ‘భారతీయుడు-2’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‏లో క్రేన్ యాక్సిడెంట్ అవడంతోపాటు కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇక మళ్ళీ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.


కాగా.. శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, రాక్ స్టార్‌ యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.చరణ్, యశ్‌ హీరోలుగా ఓ చారిత్రాత్మక యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా తీయాలనుకుంటున్నారట శంకర్‌. ఇప్పటికే చెర్రీకి,యశ్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.కాగా,2022 రెండో భాగంలో చిత్రీకరణ ప్రారంభం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు