యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్’లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్‌నీల్ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా,భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ‘సలార్’లో విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘మాస్టర్’లో ప్రతినాయకుడి పాత్రను పోషించిన విజయ్‌సేతుపతి నటనకు ముగ్దుడైన ప్రశాంత్ నీల్.. ‘సలార్’ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడు..అనంతరం ఆదిపురుష్ చిత్రీకరణలో కూడా పాల్గోననున్నాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.