Home సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌’కు భారీ షాక్.. విడుదల తేదీ లీక్‌ చేసిన ఐరిష్ నటి!

ఆర్‌ఆర్‌ఆర్‌’కు భారీ షాక్.. విడుదల తేదీ లీక్‌ చేసిన ఐరిష్ నటి!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్‌ నటించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు’, ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం’ వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ సినిమా విడుదల కోసం దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.


కాగా,‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో కీలక పాత్ర పోషిస్తోన్న ఐర్లాండ్‌కు చెందిన నటి అలిసన్ డూడీ పొరపాటున ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను ఈ ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ గతంలో ప్రకటించింది. కానీ, లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌ ఆగిపోవడంతో అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయడం కుదరలేదు. అయితే, కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు ప్రకటించలేదు.అయితే, ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారని అలిసన్ డూడీ లీక్ చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కానీ, తప్పును గ్రహించిన అలిసన్ వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేశారు. అయితే, అప్పటికే కొంతమంది ఆ స్క్రిన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు