టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓ అరుదైన ఘనత సాధించింది.భారత సినీ చరిత్రలో మరో నటికి సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది.. ట్విటర్ ఏమోజీ పొందిన తొలి భారతీయ నటిగా నిలిచింది. సమంత నటించిన `ఫ్యామిలీమేన్-2` వెబ్ సిరీస్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే..ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా అమేజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ `ఫ్యామిలీమేన్-2` ట్విటర్ ఎమోజీని ఆవిష్కరించింది. దీనిలో మనోజ్ బాజ్‌పేయితోపాటు సమంత కూడా ఉంది. ట్విటర్ ఎమోజీ సాధించిన తొలి భారతీయ నటిగా సమంత నిలిచింది. దీంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
కాగా, సోషల్ మీడియా వేదికగా సమంత తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ‘ఓ బేబీ’ తర్వాత ఈ మధ్యకాలంలో సినిమాల జోరు కాస్త తగ్గించిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘ఫ్యామిలీమెన్ 2’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే గుణశేఖర్ రూపొందించనున్న ‘శాకుంతలం’ సినిమాలో సమంతను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.