Home సినిమాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ సర్‌ప్రైజ్‌..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ సర్‌ప్రైజ్‌..

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుమారు రూ.400 కోట్లతో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా,ఈ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ యంగ్ రెబల్ స్టార్ అభిమానుల కోసం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ను ఇస్తానని తేదీలతో సహా ప్రకటించారు.సంక్రాంతి పండుగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్‌డేట్‌ ఇస్తానని నాగ్‌అశ్విన్‌ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో అభిమానులు ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్‌ అశ్విన్‌..జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా ఒక అప్‌డేట్‌ ఉంటుంది అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు