మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్,మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక.కాగా, ఈసినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్ కోసం పక్కాగా స్కెచ్చేసిన ‘ఆచార్య’ చిత్రయూనిట్ ఓ పాటను కూడా ప్లాన్ చేశారని సమాచారం. ఇందులో చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే మణిశర్మ ఈ సాంగ్ కూడా కంపోజ్ చేసి పెట్టారని, అతి త్వరలో కొరటాల శివ ఈ సాంగ్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారని సమాచారం.
కాగా,యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోనటుడు సోనూసూద్ ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నారు.మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం భారీ పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌధ్రం రణం రుధిరం)లో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ యూనిట్ స్వయంగా వెల్లడించింది. కాగా ఇందులో స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో వీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే.