Home సినిమాలు స్టేజ్‌పైనే కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్‌

స్టేజ్‌పైనే కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్‌

టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో అమృతఅయ్యార్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


అయితే చిత్ర ప్రమోషన్ లో భాగంగా తాజాగా ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’ ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు మున్నా.. ముందు నుంచి తమ చిత్రానికి అండగా నిలుస్తున్న మీడియాకు, స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్‌ మాట్లాడుతూ తమ సినిమాకి మంచి సంగీతాన్ని అందించిన అనూప్‌రూబెన్స్‌కు, ‘నీలినీలి ఆకాశం’ వంటి అద్భుతమైన పాటను అందించిన చంద్రబోస్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలోనే వేదికపై హీరో వెనుక నిల్చొని ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్టేజ్‌పై ఉన్న ప్రదీప్‌, ఇతర చిత్రబృందం ఆయనకు మంచినీళ్లు అందించారు. అనంతరం స్టేజ్‌పై నుంచి దింపి ప్రథమ చికిత్స చేయించారు. అయితే ఆ తరువాత దర్శకుడు మున్నా కోలుకొని మళ్ళీ వేదికపైకి వచ్చారు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు