Home సినిమాలు హీరో వరుణ్‌ పెళ్లి..అంతలోనే కారుకు ప్రమాదం

హీరో వరుణ్‌ పెళ్లి..అంతలోనే కారుకు ప్రమాదం

బాలీవుడ్‌ యువ హీరో వరుణ్ ‌ధావన్‌ పెళ్లి ఎట్టకేలకు నేడు(ఆదివారం) జరగబోతోంది. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దళాల్‌తో ధావన్ ఏడడుగులు వేయబోతున్నాడు. వీరి దాంపత్య జీవితానికి శుభారంభం పలికేందుకు అలీభాగ్‌లోని ద మాన్షన్‌ హౌస్‌ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు శషాంక్‌ ఖైతన్‌, మనీష్‌ మల్హోత్రా, జోవా మొరానీ, డాలీ సిధ్వానీ శనివారమే పెళ్లి మండపానికి చేరుకున్నారు.మ‌రి కొద్ది గంట‌ల‌లో వ‌రుణ్‌- న‌టాషా జంట వేద‌మంత్రాల సాక్షిగా ఒక్క‌టి కానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ నుండి షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా వంటి సెలెబ్రెటీలు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో రిసెప్ష‌న్ కూడా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.


ఇదిలావుండగా.. వరుణ్‌ ధావన్‌ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్‌ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్‌ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు.దింతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా వరుణ్‌ ధావన్‌ ఇటీవల నటించిన చిత్రం ‘కూలీ నెం.1’. తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీఖాన్‌ కథానాయిక. 2020 డిసెంబర్ 25న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు