కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్దిరోజుల పాటు ప్రియుడు మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. సినిమాలు కూడా పక్కన పెట్టేసి ప్రియుడితో ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె ప్రేమ సంగతులే కనిపించాయి. ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఆమె.. అతన్ని భారత్ తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైందనే వార్తలు వచ్చాయి. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఉహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి కెమెరా ముందుకొచ్చింది శృతిహాసన్.
అయితే తాజాగా శృతి అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెను అనేక ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ ఆమె ఓపికగా సమాధానాలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారా అన్న ప్రశ్న ఆమెకు మరోసారి ఎదురైంది. దీనికి ఈ బ్యూటీ ముమ్మాటికీ జరగడం లేదని తేల్చి చెప్పింది. తర్వాత ఓ అభిమాని మీరు మీ మాజీ ప్రియుడు మైఖెల్‌ను అసహ్యించుకుంటున్నారా? అని అడిగాడు దీనికి శ్రుతిహాసన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సమాధానం ఇచ్చింది. ‘మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే, నేను ఎవరినీ ఆసహ్యించుకోను. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోలోపల కాస్త బాధపడతాను’ అని చెప్పుకొచ్చింది.Attachments area