యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది.దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను ఇటీవలే ప్రారంభించారు.ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించనున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కథానాయికగా నటిస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తుండగా, తాజాగా కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆదరణ ఉన్న శృతి హాసన్ అయితే ప్రభాస్‌కు సరైన జోడి అని, రెమ్యునరేషన్ విషయంలోను ఈ శృతితో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని నిర్మాతలు భావించారట. అందుకే ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.మరోవైపు ‘సలార్’లో విజయ్ సేతుపతి విలన్‌గా చేయబోతున్నారట.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ప్రభాస్–విజయ్ సేతుపతి కాంబినేషన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం.