Home సినిమాలు మరికాసేపట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అప్‌డేట్‌: మీరు సిద్ధమా?

మరికాసేపట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అప్‌డేట్‌: మీరు సిద్ధమా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు’, ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం’ వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కాగా,సుమారు 450 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా అప్ డేట్ గురించి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడబోతోంది. సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అందించేందుకు `ఆర్ఆర్ఆర్` చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు `ఆర్ఆర్ఆర్` సినిమాకు సంబంధించి అప్‌డేట్ బయటకు రాబోతోందని చిత్రయూనిట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది.కాగా,ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ ఇటీవలే వెల్లడించింది.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

ఇటీవలి వ్యాఖ్యలు