సూపర్‌స్టార్ మహేశ్ కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. షూటింగ్స్ బిగిన్స్ అనే చిన్న పాటి వీడియో ప్రోమోతో పాటు ‘ఆక్షన్ యాక్షన్ బిగిన్స్’ అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మహేశ్ సరసన కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తుండగా..తమన్ సంగీతం అందిస్తున్నారు..
ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కొంత కాలం నుంచి మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా హాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ట్వీట్స్ తో అదరగొట్టారు. దీంతో ఆ మార్క్ వంద మిలియన్స్ క్రాస్ అయింది. ఇప్పటి వరకు ఏ సినిమా ట్యాగ్ కూడా ఈ రేంజ్లో ట్రెండ్ కాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.