Home సినిమాలు సాయిధ‌ర‌మ్ తేజ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ వైరల్

సాయిధ‌ర‌మ్ తేజ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ వైరల్

వరుస విజయాలతో జోరుమీదున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద‌ర్శకుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.కాగా,గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమ‌వారం విడుదల చేసింది. 


“ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు, శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు..ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది. ప్ర‌భుత్వం అవుతుంది. అదే అస‌లైన రిప‌బ్లిక్” అంటూ కోర్టు రూమ్‌లో సాయిధ‌ర‌మ్ వాయిస్ ఓవ‌ర్ తో ప్ర‌జాస్వామ్యం గురించి చెప్తున్న సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.ఈ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సాయి తేజ్.. ఇలాంటి సినిమాలో నటిస్తుండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాగా,జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేలా చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో.. బ్లాక్ బస్టర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన తరవాత ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ...

థియేటర్‌లో ‘హాకీ’ ఆడేందుకు దూసుకొస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌...

ఇటీవలి వ్యాఖ్యలు