ఇటీవలి కాలంలో సరైన సక్సెస్‌లేక డీలాపడిన రవితేజ ‘క్రాక్’ సినిమాతో ట్రాక్ ఎక్కేశారు. మాస్ మహారాజ్ గత సినిమాల్లో ‘రాజా ది గ్రేట్’ తర్వాత ”టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా” వంటి సినిమాలు ఆశించిన స్థాయి రిజల్ట్ రాబట్టకపోవడంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఈ ‘క్రాక్’తోనైనా తిరిగి రవితేజ సత్తా చాటుతాడా? అని ఎదురుచూసిన ఆయన అభిమానులకు క్రాకింగ్ రిజల్ట్ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నారు రవితేజ. ఇప్పుడు ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
కాగా,రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ‘ఖిలాఢి’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్టైలిష్ లుక్‌లో రవితేజ పెద్ద సుత్తి పట్టుకుని నడుస్తున్నట్లు గ్లింప్స్ వీడియోలో ఉంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిసమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.