Home సినిమాలు లాల్ సింగ్ చద్దా': నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ!

లాల్ సింగ్ చద్దా’: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ!

అద్భుత నటనతో తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా స్టార్స్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోలు ప్యాన్ ఇండియా స్టార్స్‌గా మార‌గా, ఇప్పుడు అక్కినేని యువ హీరో నాగ చైత‌న్య కూడా ఈ జాబితాలో చేరాల‌ని భావిస్తున్న‌ట్టు సమాచారం. ఇప్ప‌టికే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన నాగ చైతన్య ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరక్షించుకోవాలని చూస్తున్నాడు.


కాగా,బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాలో ఓ కీలక పాత్ర కోసం నాగ చైతన్యను సంప్రదించారట చిత్ర బృందం..తొలుత ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని భావించినప్పటికీ, డేట్స్‌ కుదరకపోవడంతో ఆ అవకాశం నాగచైతన్యకి దక్కింది.కాగా,అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరో సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో చైతన్య కూడా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.అలాగే ఫిబ్రవరి నెలలోనే నాగ చైతన్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు....

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇటీవలి వ్యాఖ్యలు