మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.చిరంజీవి సరసన నయనతార కథానాయికగా సందడి చేయనున్నారు. ఇందులో రామ్‌చరణ్ సిద్ధగా కీలకపాత్రను పోషిస్తున్నారు. చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా,శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ మేరకు టీజర్ విడుదల తేదీని తెలియజేస్తూ బుధవారం ఓ సరికొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
కాగా,ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ పాటలో చిరు స్టెప్స్ అభిమానులతో ఈలలు కొట్టించేలా ఉన్నాయట. ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు.