అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రష్మిక నాయిక. పాన్ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని బన్నీ ట్విటర్ ద్వారా తెలిపాడు.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఫిబ్రవరి తొలి వారానికి అక్కడి షెడ్యూల్ ముగుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో వేసిన సెట్లో పది రోజుల పాటు ఓ షెడ్యూల్ జరపనున్నారు. అనంతరం కేరళ వెళ్లి అక్కడ లాంగ్ షెడ్యూల్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నారు.
గత డిసెంబర్ తొలి వారంలో చిత్రబృందంలోని కొందరు కరోనా బారిన పడటంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. జనవరి నుండి మారేడుమిల్లిలో వేగంగా షూటింగ్ చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారిన యువకుడిగా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం..అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..