యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా. డి.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘నా జీవితంలో అమ్మకి.. అమ్మాయికి.. బైక్‌కి ‘అభి’నాభావ సంబంధం ఉంది’’ అంటూ సుశాంత్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత వెంటనే ఎవరా ‘అభి’ అని వెన్నెల కిషోర్ అడగటం నవ్వులు పూయిస్తోంది. తనకి ఇష్టమైన బైక్ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రేమించిన అమ్మాయి మనసును ఎలా గెలుచుకున్నాడు?ఇలాంటి సన్నివేశాలను టీజర్లో చూడొచ్చు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, సుశాంత్‌ల కాంబినేషన్ చక్కగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
కాగా,రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.